Datta Divine Showers

శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికీ సంచరిస్తున్నారా ?

Lord Dattatreya is giving Darshan even today?

 

శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికీ సంచరిస్తున్నారా ?

అవును. ఇది యదార్ధము. ముమ్మాటికీ నిజం., ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లాలోని మాచర్ల దగ్గర వున్న “ఎత్తిపోతల” క్షేత్రంలో స్వయంభువై ఏకముఖి దత్తాత్రేయ స్వామిగా పూజలందుకుంటున్న ఈ క్షేత్రంలో ఈ సంఘటనలు ఆశ్చ్యర్యాన్నీ, మరింత విశ్వాసాన్ని కల్గిస్తోంది. ఈక్షేత్రానికి మాచర్ల గ్రామ చుట్టుప్రక్కల వున్న “తండా” ల నుండి వేలమంది భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు. వారికి ఆచారాలు ఏమి తెలియవు. చదువు లేదు. మంత్రాలు అసలే రావు. కేవలం మూఢ భక్తి. నెయ్యితో చేసిన అన్న పరమాన్నముతో స్వామిని దర్శిస్తారు. దత్తుని మీద అపారమైన విశ్వాసం, నమ్మకం. అవే వారిని ఆరోగ్యదాయకమైన, ఆనందమయమైన జీవితాన్ని నడిపిస్తున్నాయి. గర్భాలయాల్లో రుద్రాభిషేకాలు, పంచ సూక్తాలు, శాంతిమంత్రాలు చదువుతున్న మనం, వీళ్ళను చూస్తే ఆ స్వామే వీరి చెంత ఉండడానికి ఇష్టపడుతున్నాడా? అని భావించక తప్పదు. వీరికి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు సర్వం దత్తాత్రేయుడే. ” మాకు నీవే దిక్కు. అనారోగ్యం వచ్చినా, ఆర్ధిక ఇబ్బంది వచ్చినా, ఏమి కావాలన్నా నువ్వే శరణు, నువ్వే దిక్కు”  అని దత్తాత్రేయుడిని ప్రార్థిస్తున్న వారి మధ్య ముసలివాని రూపంలో, చిన్న పిల్లవానిగా, పిచ్చివాడిలాగా అనేక రూపాలలో సంచరిస్తున్న శ్రీ గురుదత్త మహారాజ్ దర్శన భాగ్యాన్ని పొందుతున్న ఆ భక్తులు ఎంత ధన్య జీవులో? …..వారి మాటల్లోనే వినండి…..ఆనంద పారవశ్యం పొందండి…హృదయ స్పందనని గమనించండి…. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త……

 

దత్తాత్రేయ స్వామి సంచార రూపాల్ని “శ్రీ దత్త అనుష్టుప్ మంత్రం” లో చెప్పబడింది.

దత్తాత్రేయ హరే కృష్ణా || ఉన్మత్తానంద దాయకా|| దిగంబర మునే బాల || పిశాచ జ్ఞాన సాగరా||

Lord Dattatreya is giving Darshan even today?

Yes..Yes.. This is true and yadaardha. The incidents which are happening in the swayambhu ekamukhi datta kshetra “Ethipothala” are creating aascharya and confidence on Dattaguru. The kshetra is nearer to Macherla of Guntur district in Andhrapradesh on the bank of Krishna river. Thousands of devotees visit the temple coming from  “THAANDA” villages nearby  Macherla. They don’t know AACHAARA. They are illiterates. They don’t know the Mantras. They are having pure devotion only. They are preparing Sweet rice pongal with ghee and coming for darshan. They are leading their lives with aarogyadaayaka and aanadamaya by having  Unexplainable faith and confidence on Lord Dattatreya.  We are reciting Rudrabhishekas, Pancha sooktas, Shanthi mantras in Garbhalayaas. By seeing them, a feel generats in our hearts that ‘whether Dattaguru showing interest to live among them’?

They are feeling that, Lord Dattatreya is their Mother, Father, Brother and  Sarvam. They are praying from the bottom of their heart that “ you are only one for us. If we feel with ill health or for financial support or for any thing….you are only the supreme. You are there for us. We are surrendering at your lotus feet. Shree datta sharanam mama”.  Lord Dattatreya is giving darshan to them in the forms of old man, child, mad man etc., The forms of Lord Dattatreya mentioned in Datta anushtup mantra as

 

“Dattatreya Hare Krishna Unmatthaananda Daayaka||

Digambara Mune Baala||Pishaacha Gnaana Saagara”||

They are getting darshan bhagya of Dattaswamy. They are calling him as “DATTAYYAA”.  Listen to their words  about this reality …..have the AANANDA PAARAVASHYA……observe your HRUDAYA SPANDANA…

 AVADHOOTHA CHINTHANA SREEGURU DEVA DATTA!!!